0473 Enthati Vaaralu Evvarunu Hari NCSridevi


ప|| ఎంతటివారలు నెవ్వరును హరి | చింతించక నిశ్చింతలు గారు || చ|| అతిజితేంద్రియులు ననశనవ్రతులు- | నతులతపోధనులగువారు | చతురాననగురుస్మరణము దొరకక | తతి నూరక పుణ్యతములు గారు || చ|| అనఘులు శాంతులు సధ్యాత్మతతులు- | ననుపమపుణ్యులు యాజకులు | వనజోదరు ననవరతము దలచక | వినుతిస్మౄతిని విబుధులు గారు || చ|| దురితవిదూరులు దుర్మతిహీనులు | నిరతానందులు నిత్యులును | తిరువేంకటగిరిదేవుని గొలువక | పరమార్గమునకు బ్రహ్మలు గారు || pa|| eMtaTivAralu nevvarunu hari | chiMtiMcaka niSciMtalu gAru || ca|| atijitEMdriyulu nanaSanavratulu- | natulatapOdhanulaguvAru | caturAnanagurusmaraNamu dorakaka | tati nUraka puNyatamulu gAru || ca|| anaGulu SAMtulu sadhyAtmatatulu- | nanupamapuNyulu yAjakulu | vanajOdaru nanavaratamu dalacaka | vinutismRutini vibudhulu gAru || ca|| duritavidUrulu durmatihInulu | niratAnaMdulu nityulunu | tiruvEMkaTagiridEvuni goluvaka | paramArgamunaku brahmalu gAru ||